
రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలు తమకున్న అచంచల విశ్వాసాన్ని ఎన్నికల్లో నిలబెట్టారని అన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా దేశప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా మూడు నెలల విరామం తర్వాత ప్రారంభమైన మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)ని మళ్లీ అధికారంలోకి తెచ్చినందుకు ఓటర్లకు ప్రధాని మోదీ తన ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారని.. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 25న మన్ కీ బాత్ చివరి ఎపిసోడ్ జరిగింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ కారణంగా మన్ కీ బాత్ పోగ్రామ్ కు బ్రేక్ పడింది.