వికసిత్​ భారత్ సంకల్ప్ యాత్ర సక్సెస్​ చేయాలె : పౌసుమి బసు

వికసిత్​ భారత్ సంకల్ప్ యాత్ర సక్సెస్​ చేయాలె :  పౌసుమి బసు

మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు సూచించారు. శుక్రవారం మెదక్, సంగారెడ్డి​కలెక్టర్​ఆఫీసుల్లో ఆయా శాఖల అధికారులతో వికసిత్​భారత్ సంకల్ప్ యాత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎంజేఏవై,  పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన, దీన్​దయాళ్​అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం విశ్వకర్మ

 పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ), పీఎం పోషన్ అభియాన్, హర్ ఘర్ జల్--జీవన్ మిషన్,  సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైస్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్ ఏరియాస్(ఎస్​వీఏఎమ్​ఐటీవీఏ), జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎమ్ ప్రణామ్, నానో ఫెర్టిలైజర్ పథకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.  కార్యక్రమంలో మెదక్​అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు, సంగారెడ్డి కలెక్టర్​ శరత్, జిల్లాలకు సంబంధించిన ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సిద్దిపేట రూరల్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర అని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  అజయ్ గుప్తా  తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో  జిల్లాలో చేపట్టనున్న 'విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర' నిర్వహణ పై  సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, రెవెన్యూ అడిషనల్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, ఎల్​డీఎం సత్యజిత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.