ఇదే ఫ్రెష్​మైండ్​తో పని చేయండి: మోడీ

ఇదే ఫ్రెష్​మైండ్​తో పని చేయండి: మోడీ
  •  కొత్త ఐఏఎస్​ ఆఫీసర్లకు ప్రధాని మోడీ సూచన

‘‘మీరంతా యంగ్​ ఆఫీసర్లు. ఫ్రెష్​ మైండ్​తో సర్వీసులో చేరారు. అదే ఫ్రెష్​నెస్​ని పనిలో కూడా చూపించండి. ప్రజలకు ఏది మంచిదో ట్రైనింగ్​తో తెల్సుకుని ఉంటారు. కాబట్టి సిటిజన్​సెంట్రిక్​ పర్​స్పెక్టివ్​లోనే మీకిచ్చే ప్రతి టాస్క్​ను నిర్వహించండి” అంటూ యంగ్​ ఆఫీసర్లకు ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రెటరీగా నియమితులైన 160 మంది ఐఏఎస్​(2017బ్యాచ్​) ఆఫీసర్లతో ఆయన సోమవారం ఇంటరాక్ట్​ అయ్యారు. పీఎం అఫీషియల్​ రెసిడెన్స్​(7 లోకకల్యాణ్​ మార్గ్​)లో జరిగిన భేటీలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్​, పీఎంవో, పర్సనల్​ శాఖకు చెందిన సీనియర్​ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆహ్లాదకరంగా జరిగిన ఇంటరాక్షన్​లో ఆఫీసర్లంతా తమ క్లాస్​రూమ్​, ఫీల్డ్​ ట్రైనింగ్​ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. సీనియర్​ ఆఫీసర్ల ఎక్స్​పీరియన్స్​కు జూనియర్ల కొత్త ఆలోచనలు తోడైతే సిస్టమ్​ మరింత బలపడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇండియాలో సివిల్​ సర్వీసుల ఆర్కిటెక్ట్​గా పేరుపొందిన సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​పై ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో విజువల్​ని కొత్త ఆఫీసర్ల కోసం ప్రదర్శించారు.