పారా అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ ముచ్చట్లు

పారా అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ ముచ్చట్లు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న పారా అథ్లెట్లతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వారితో మాట్లాడారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పతకాలు గెలిచినవారిని ప్రశంసించారు. మోడీకి తమ మెడల్స్ చూపించారు విజేతలు. అథ్లెట్ల ప్రదర్శన పట్ల భారత్ గర్వపడుతోందన్నారు మోడీ. ఈ మీటింగ్ గత గురువారమే జరిగినప్పటికీ... దానికి సంబంధించిన వీడియోలను కాసేపటి క్రితం రిలీజ్ చేసింది ప్రధానమంత్రి ఆఫీస్.

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ 19 పతకాలు గెలిచింది. అందులో 5 గోల్డ్ , 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. గతంలో ఏ పారాలింపిక్స్ లోనూ ఇన్నేసి పతకాలు భారత్ గెలవలేదు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్ లో 2 గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ తో కలిపి నాలుగు మెడల్స్ గెలిచింది భారత్. మొన్నటివరకు అదే రికార్డ్ కాగా... ఈసారి మన పారా అథ్లెట్స్ కొత్త రికార్డులు సృష్టించారు.