ప్రపంచంలో నాకంటే ధనవంతులు లేరు: మోదీ

ప్రపంచంలో నాకంటే ధనవంతులు లేరు: మోదీ

 ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్: గడిచిన పదేళ్లుగా మహిళలభద్రత కోసం తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింద ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్ష విధించేలా చట్టాలని సవరించినట్లు తెలిపారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.  ఒక అమ్మాయి ఇంటికి ఆలస్యంగా వస్తే ఆమెను తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. కానీ అబ్బాయిల విషయంలో మాత్రం జరగదు. అబ్బాయిలను కూడా ప్రశ్నించాలి. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చి లక్షలాది మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడినం. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం నాకు ఉంది. ప్రపంచంలోనే నాకంటే ధనవంతులు లేరని' అని మోదీ అన్నారు.

ALSO READ | మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. నెలకు రూ.2500 ఇచ్చే స్కీమ్ ప్రారంభం