మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

 ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 9న  రాష్ట్రపతి భవన్‌లో  రాత్రి 7.15 గంటలకు ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు ఎంపీలు  కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా మూడో సారి. 


ఈ కార్యక్రమానికి పలువురు దక్షిణాసియా నేతలు హాజరుకానున్నారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జును కూడా పిలిచారని తెలుస్తోంది. మయిజ్జు మోదీకి అభినందనలు కూడా తెలిపారు.  శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధి నేతలు కూడా మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

 మరో వైపు మోదీ ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దేశ,విదేశ ప్రముఖులు రానుండటంతో 2500 మందిపోలీసులతో పాటు 5కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి.