‘బ్రిక్స్’ సమ్మిట్​కు మోడీ

‘బ్రిక్స్’ సమ్మిట్​కు మోడీ
  • బ్రెజిల్​కు బయలుదేరి వెళ్లిన ప్రధాని
  • నేడు, రేపు జరిగే సదస్సుకు హాజరు
  • బ్రెజిల్, రష్యా, చైనా ప్రెసిడెంట్లతో మీటింగ్స్

న్యూఢిల్లీ: ‘‘ప్రపంచంలోని ఐదు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) మేజర్ ఎకానమీ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకు నే అంశంపై బ్రిక్స్​సమ్మిట్ ఫోకస్ చేస్తుంది. డిజిటల్ ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ, కౌంటర్ టెర్రరిజం కో–ఆపరేషన్ తదితర కీలక అంశాలపై దృష్టి పెడుతుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 11వ బ్రిక్స్ సమ్మిట్​లో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం ఆయన బ్రెజిల్​కు బయలుదేరి వెళ్లారు. బుధ, గరువారాల్లో సదస్సుకు హాజరవుతారు. అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. ‘సరికొత్త భవితకు ఆర్థిక అభివృద్ధి’కి బ్రిక్స్ దేశాల​మధ్య కో–ఆపరేషన్​పై చర్చిస్తామని చెప్పారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సొనారోతో భేటీ అవుతానని, రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంపై చర్చిస్తానని చెప్పారు.

పుతిన్, జిన్​పింగ్​తో భేటీ

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్​పింగ్​తో ప్రధాని మోడీ వేర్వేరుగా భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలపై వారితో చర్చిస్తారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ముగింపు సమావేశం, బ్రిక్స్ సమ్మిట్ ప్లీనరీ సెషన్లకు హాజరవుతారు.

  • 2014 నుంచి ఇప్పటివరకు బ్రిక్స్​ సమ్మిట్​లో మోడీ పాల్గొనడం ఇది ఆరోసారి.
  • ప్రపంచ జనాభాలో 42 శాతంబ్రిక్స్ దేశాల్లోనే ఉంది.
  • అలాగే 23 శాతం గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈ దేశాల నుంచి వస్తోంది.

PM Modi Leaves for Brazil to Attend BRICS Summit