గ్రేట్ కదా : స్వయంగా టేబుల్ జరిపిన ప్రధాని మోదీ

గ్రేట్ కదా : స్వయంగా టేబుల్  జరిపిన ప్రధాని మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి వచ్చిన ఒక వీడియోలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ టేబుల్ ఏర్పాటులో సహాయం చేస్తూ కనిపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సీఎం ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా వేదికపై ఉన్న టేబుల్‌ను కదిలించడంలో ప్రధానమంత్రి మోదీ సహకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి విష్ణు దేవ్ సాయి డిసెంబర్ 13న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనియర్ బీజేపీ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాయ్‌పూర్‌లోని సైన్స్‌ కళాశాల మైదానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.