గురువాయుర్‌ లో మోడీ తులాభారం

గురువాయుర్‌ లో మోడీ తులాభారం

కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇవాళ(శనివారం) ఉదయం త్రిసూర్ జిల్లాలోని గురువాయుర్ చేరుకుని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రాధరణలో టెంపుల్ కు వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత  పళ్లు, రూపాయి నాణేలతో తులాభారం వేయించుకున్నారు. తర్వాత  శ్రీ కృష్ణ భగవాన్ ను దర్శించుకున్నారు.

ఆలయ దర్శనం తర్వాత బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత కేరళ నుంచి మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (ఆదివారం) మోడీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లనున్నారు.