ప్రజల రక్షణ, సంక్షేమమే ప్రధానికి ముఖ్యం..కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

ప్రజల రక్షణ, సంక్షేమమే ప్రధానికి ముఖ్యం..కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

గజ్వేల్‌‌‌‌ (వర్గల్‌‌‌‌), వెలుగు : దేశ ప్రజల ఆత్మాభిమానం, సంక్షేమమే ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్రమంత్రి జి.కిషన్‌‌‌‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌‌‌‌ మండలం గౌరారం శివారులో ఆదివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాల వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకోవాలని కొన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎవరు ఎంత బెదిరించినా భారతీయులు, పీఎం మోదీ బెదిరే రకం కాదన్నారు. 

దేశంలో ఇప్పటికీ 50 నుంచి 60 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని చెప్పారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కోసం కేంద్రం రూ. 26 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మోదీ వచ్చాక మద్దతు ధర రూ. 1,300 నుంచి రూ. 2,600కు పెరిగిందన్నారు. డెయిరీ ప్రొడక్షన్‌‌‌‌లో భారత్‌‌‌‌ మొదటి స్థానంలో ఉందన్నారు. రైతులు ఆధునిక పద్ధతులు ఉపయోగించి సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, నేచురల్ ఫార్మింగ్ విధానం అనుసరించాలని చెప్పారు.