కోల్‌కతా పోర్టు ట్రస్టుకు BJS ఫౌండర్ పేరు పెట్టిన మోడీ

కోల్‌కతా పోర్టు ట్రస్టుకు BJS ఫౌండర్ పేరు పెట్టిన మోడీ

కోల్‌కతా పోర్టు ట్రస్టుకు భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పేరును పెట్టారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కతా పోర్టు ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్టు పేరును డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఒక దేశం ఒక రాజ్యాంగం అనే భావనకు రూపకల్పన చేసిన మహనీయుడు ముఖర్జీ అని ప్రధాని అన్నారు. ఈ పోర్టు భారతదేశ పారిశ్రామిక, ఆధ్యాత్మిక మరియు స్వయం సమృద్ధి ఆకాంక్షలను సూచిస్తుందన్నారు మోడీ. ఈ పోర్టును న్యూ ఇండియాకు శక్తివంతమైన చిహ్నంగా మార్చడం మనందరి బాధ్యతని చెప్పారు. శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబరు 21న ఢిల్లీలో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీయే ఇప్పటి భారతీయ జనతా పార్టీ(BJP).