జగన్‌తో మీటింగ్ అద్భుతం:APకి అండగా ఉంటామన్న మోడీ

జగన్‌తో మీటింగ్ అద్భుతం:APకి అండగా ఉంటామన్న మోడీ

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ తర్వాత.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అద్భుతమైన సమవేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. ” అని మోడీ చెప్పారు.