గగన్ యాన్కు నలుగురు వ్యోమగాములు సెలెక్ట్

గగన్ యాన్కు నలుగురు వ్యోమగాములు సెలెక్ట్
  • వ్యోమగాముల పేర్లను వెల్లడించిన ప్రధాని మోదీ 

గగన్ యాన్ మిషన్ లో అంతరిక్ష యాత్రకు నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ మంగళవారం (ఫిబ్రవరి 27)  వెల్లడించారు. ఈ మిషన్ అలో గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగజ్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాలను ఎంపిక చేశారు. వీరంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని పైలట్లు.  గగన్ యాన్ మిషన్ దేశంలో మొట్ట మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్ మిషన్ పురోగతి సమీక్ష లో పాల్గొన్న ప్రధాని మోది అంతరిక్ష యాత్రకు ఎన్నికోబడిన నలుగురు వ్యోమగాములకు వింగ్స్ ప్రదానం చేశారు.  

ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యోమగాములనుద్దేశించి మాట్లాడుతూ.. వీరు కేవలం మానువులు కాదు.. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్న నాలుగు శక్తులు అని కొనియాడారు. భారతీయుడు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాడు. రాబోయే 40 యేళ్ల కాలం మనదే అని మోదీ అన్నారు.  

ALSO READ :- మూడోసారీ ప్రధాని మోదీయే.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: డీకే అరుణ

2035 నాటికి భారత్ అంతరిక్షంలో తన స్వంత స్పేస్ స్టేషన్ ను కలిగి ఉంటుందన్నారు మోదీ. ఇది అంతరిక్షంలోని అనేక రహస్యాలను అధ్యయనం చేయడంలో మనకు సహాయ పడుతుందన్నారు. అమృత్ కాల్ కాలంలో భారతీయ వ్యోమగామి స్వశక్తిో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతాడని ప్రధాని మోదీ అన్నారు. 

గగన్ యాన్ మిషన్ 

2025లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ప్రారంభించడం ద్వారా భారతీయ మానవులను అంతరిక్షంలోకి పంపి తిరిగి సురక్షితంగా సముద్రంలో ల్యాండింగ్ చేయడం ద్వారా తిరి గి భూమికి పంపే లక్ష్యాన్ని ఇస్రో పెట్టుకుంది. ఈ మిషన్ గణనీయమైన సాంకేతిక పురోగతిని మాత్రమే కాకుండా అంతరిక్ష పరిశోధనలో పెరుగుతున్న భారత పరాక్రమాన్ని నొక్కి చెబుతుంది.