మన భవిష్యత్​ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర

మన భవిష్యత్​ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర

న్యూఢిల్లీ :  టీచర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  టీచర్లకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. మన కలల సాకారం, భవిష్యత్​ నిర్మాణంలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తారని మెచ్చుకున్నారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్​ జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే జరుపుకుంటున్నామని ప్రధాని గుర్తు చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో ఆయనకు నివాళి అర్పించారు. టీచర్ల త్యాగానికి సెల్యూట్ ​చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 7 లోక్​ కల్యాణ్​ మార్గ్​లో 75మంది అవార్డు విజేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జాతీయ ఉత్తమ టీచర్స్ పురస్కార విజేతలను కలిసిన వీడియోను ఈ సందర్భంగా  ప్రధాని మోదీ షేర్​ చేశారు. దేశవ్యాప్తంగా స్కూళ్లల్లో భిన్న సంస్కృతి, సంప్రదాయాలపై ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా కోరారు. దేశంలోని యువత అభివృద్ధికి టీచర్లు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.