కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం: ప్రధాని మోదీ

కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం:  ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :  గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా తమ పదేండ్ల పాలనలో ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘రోజ్ గార్ మేళా’లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన లక్ష మందికి పైగా యువతకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్​మెంట్ లెటర్లను ఆయన అందజేశారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యంగా జరిగేది. ఉద్యోగాల భర్తీలో లంచాలు కూడా ఉండేవి. 

మేం వచ్చాక మొత్తం మార్చేశాం. అవినీతి అనేదే లేకుండా చేశాం. పారదర్శకంగా, నిర్ణీత టైమ్ పీరియడ్​లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం” అని మోదీ తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ పవర్ స్కీమ్​తో యువతకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘కర్మయోగి భవన్’కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.