యుద్ధం ఆపి.. శాంతిని స్థాపించాలి: ప్రధాని

యుద్ధం ఆపి.. శాంతిని స్థాపించాలి: ప్రధాని

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు యుద్ధం ఆపేసి.. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసీతో మోదీ ఫోన్​లో మాట్లాడారు. రోజురోజుకూ అక్కడి పరిస్థితులు దిగజారిపోతుండడంపై విచారం వ్యక్తం చేశారు. మానవతా సాయం అందించాల్సిన అవసరాన్ని చర్చించారు. టెర్రర్ దాడులు, హింసాత్మక ఘటనలు, పౌరుల మరణాలపై ఇద్దరు ఆందోళన వ్యక్తంచేశారు. 

వీలైనంత త్వరగా అక్కడ శాంతి నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లోని పౌరులకు సాయం అందించేందుకు ముందుండాలని నిర్ణయించారు. అబ్దెల్​తో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్​లో వెల్లడించారు. ‘‘ఈజిప్ట్  అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసీతో మాట్లాడాను. వెస్ట్ ఆసియాలో ఆందోళనకర పరిస్థితులపై చర్చించాం. టెర్రరిజం, హింస, వేలాది మంది పౌరుల మరణాలు కలిచివేశాయి” అని మోదీ తెలిపారు.