రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి

రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల మీద ప్రధాని మోడీ స్పందించారు. ఈ చట్టాల విషయంలో అన్నదాతలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. ‘ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాలకు అనుకూలంగా వ్యవహరించాయి. వాళ్లు పవర్‌‌లో ఉన్నప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దేశం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సమయంలో వీళ్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతు సోదరుల అనుమానాలను నివృత్తి చేయడానికి మేం 24 గంటలూ సిద్ధంగా ఉన్నాం. తొలి రోజు నుంచి రైతుల హితానికి మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని మోడి పేర్కొన్నారు.