పేదలు.. మహిళలు.. రైతుల కోసం.. బీజేపీ సర్కార్ ఉండాల్సిందే

పేదలు.. మహిళలు.. రైతుల కోసం.. బీజేపీ సర్కార్ ఉండాల్సిందే

సహరణ్‌‌‌‌పూర్: ‘‘ముస్లిం మహిళలపై అణచివేత ఉండకూడదంటే.. మహిళలు భయాందోళనల మధ్య కాకుండా స్వేచ్ఛగా బతకాలంటే.. మంచి ఆస్పత్రుల్లో పేదలు రూ.5 లక్షల దాకా వైద్యాన్ని ఉచితంగా పొందాలంటే.. పీఎం కిసాన్ కింద రైతులకు సాయం అందాలంటే.. క్రిమినల్స్‌‌‌‌ను జైళ్లకు పంపాలంటే.. పేదలు ఉచితంగా రేషన్ పొందాలంటే.. ఫ్రీగా వ్యాక్సిన్ వేసుకోవాలంటే.. పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు అందాలంటే.. బీజేపీ సర్కారు ఉండాల్సిందే’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని సహరణ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండక తప్పదని అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌‌‌‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చామని, బాధిత ముస్లిం మహిళలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతుందన్నారు. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ మాఫియాను సపోర్ట్ చేసిందని, క్రిమినల్స్‌‌‌‌ను ఎన్నికల్లో నిలబెట్టిందని మోడీ విమర్శలు చేశారు. వెస్ర్టన్‌‌‌‌ యూపీ అంతటా క్రిమినల్స్‌‌‌‌ను పోటీలో నిలబెట్టారని ఆరోపించారు.   

క్రిమినల్స్‌‌‌‌ను ప్యాలెస్‌‌‌‌లకు పంపాల్నా?
క్రిమినల్స్‌‌‌‌ను జైళ్లకు కాకుండా.. ప్యాలెస్‌‌‌‌లకు పంపాల్నా అని ప్రతిపక్షాలను మోడీ ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని చెప్పారు. ఫ్యామిలీ పార్టీలు బూటకపు హామీలు ఇస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మి మోసపోవద్దని కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేరును సైతం ఓట్ల కోసం వాడుకుంటోందని మోడీ అన్నారు. గురువారం ఉత్తరాఖండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రావత్ ను సీడీఎస్ గా నియమించినప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేశారని, ఆయనను ‘సడక్ కా గూండా’ అని అవమానించారని విమర్శించారు. 

నేనెందుకు వినాలి?: రాహుల్
పార్లమెంటులో చర్చలు జరిగేటప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభలో ఉండరని, చెప్పింది వినరంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్లకు రాహుల్ గురువారం కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ చెప్పింది వినడని మోడీజీ అన్నారు. ఈడీ, సీబీఐ ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు రాహుల్ విషయంలో పని చేయడం లేదని, రాహుల్ వెనక్కి తగ్గడని ఆయన మాటలకు అర్థం. నేనెందుకు ఆయన మాట వినాలి?” అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌‌‌‌లో నిర్వహించిన ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. 

మరిన్ని వార్తల కోసం..

కోఠి ఆస్పత్రిలో కోటి సమస్యలు

కేసీఆర్​ అవినీతి లెక్కలు తీస్తం