దేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తారు: ప్రధాని మోదీ

దేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తారు: ప్రధాని మోదీ

21వ శతాబ్దంలో భారతదేశ సాంకేతిక విప్లవానికి మహిళలు నాయకత్వం వహిస్తారన్నారు ప్రధాని మోదీ. సైన్స్, ఐటీ, అంతరిక్ష రంగాల్లో మన మహిళలు ఎలా పేరు సంపాదించుకున్నారో చూస్తున్నామని చెప్పారు.  మహిళా కమర్షియల్ పైలెట్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలో మొదటిస్థానంలో ఉందన్నారు. మార్చి 11వ తేదీ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సశక్త్ నారీ-వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మహిళా సాధికారత గురించి తాను మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ వంటి పార్టీలు తనను ఎగతాళి చేస్తూ అవమానించాయని మండిపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలో డ్రోన్ టెక్నాలజీ విస్తరించబోతోందని ఆయన చెప్పారు. దేశంలోని స్వయం సహాయక సంఘాలు మహిళా సాధికారత రంగంలో కొత్త చరిత్ర సృష్టించాయని తెలిపారు. క్యాపిటలైజేషన్ సపోర్ట్ ఫండ్ ద్వారా దేశంలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇవనున్నట్లు వెల్లడించారు. అనంతరం నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు 1,000 డ్రోన్‌లను పంపిణీ చేశారు ప్రధాని.ఈ సందర్భంగా వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ల వినియోగాన్ని పరిశీలించారు. డ్రోన్లు ఆపరేట్ చేస్తున్న మహిళలను అభినందించారు మోదీ.  

ALSO READ :- మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకుని.. 25 లక్షలు కాజేసింది : సీరియల్ నటి ఐశ్వర్యపై భర్త కంప్లయింట్