కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ రేపు అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ నవంబర్ లోనూ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్యపై పరిమితి విధించాలని సూచించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది.

For more news

భారత పౌరసత్వం కోసం అమెరికన్లు, చైనీయుల అప్లికేషన్లు

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!

మా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?