
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోదీ తన రెండవ పర్యటన ఈరోజు చేస్తున్నారు. జుమ్మూ కాశ్మీర్ లో నిర్మించిన ఎయిమ్స్ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. దీనికి 2019 ఫిబ్రవరిలో మోదీ శుంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా 48.1 కి.మీ పొడవైన బనిహాల్--, సంగల్దాన్ మధ్య రైల్వే లైన్, సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ రోజు పర్యటనలో కాశ్మీర్ లోని పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి మోదీ అంకితం చేయనున్నారు. జమ్మూ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా గవర్నమెంట్ సర్వీస్ చేపట్టబోయే ఉద్యోగులకు నియామకపత్రాలు అందజేస్తారు.
నేడు రూ.13,375 విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు
మోదీ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీఠం వేస్తోంది. మూడు కొత్త ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మానేజ్ మెంట్ లను ఈరోజు వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్ గయా, ఐఐఎం విశాఖపట్నంలను జమ్మూ నుంచే ఓపెన్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 13 నవోదయ విద్యాలయాలకు బిల్డింగులు, 20కేంద్రీయ విద్యాలయాలకు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ.30,500 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. రూ.13,375 నిధులతో పలు బిల్డింగులు, నిర్మాణాలకు ఈరోజు మోదీ పునాధి రాయి వేస్తారు.