91 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం రేడియో ట్రాన్స్​ మీటర్లు.. ప్రారంభించనున్న మోడీ

91 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం రేడియో ట్రాన్స్​ మీటర్లు.. ప్రారంభించనున్న మోడీ

హైదరాబాద్, వెలుగు : 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీటర్లను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం19 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాల్లో  ప్రారంభం కానుందని ఆల్ ఇండియా రేడియో వెల్లడించింది.

వాటిలో తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ, నల్గొండ టౌన్, పెద్దపల్లి జిల్లా రామగుండం, అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఉన్నాయని వివరించింది. దేశంలో రేడియో, ఎఫ్ఎం కనెక్టివిటీని మరింత పెంచేందుకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని వల్ల అదనంగా ఆకాశవాణి కవరేజ్ మరో 35వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నట్లు చెప్పింది.