విద్యుత్ రంగానికి ప్రత్యేకమైన రోజు

విద్యుత్ రంగానికి ప్రత్యేకమైన రోజు

రాబోయే 25 ఏళ్ల కాలంలో దేశ విద్యుత్ రంగ ముఖ‌చిత్రంతో పాటు దేశ ముఖం చిత్రం మారబోతోందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. 75 సంవ‌త్సరాల భార‌త స్వాతంత్య్ర ఉత్సవాలని పురస్కరించుకుని ఆజాది కా అమృత్ మ‌హోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉజ్వల భారత్ - ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ‌ వ్యాప్తంగా విద్యుత్ రంగ పురోగతి మ‌హోత్సవాల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ భారత జాతికి అంకితం చేశారు.

విద్యుత్ రంగానికి ప్రత్యేక మైన రోజుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక్ష వీక్షణం ద్వారా వీక్షించారు. రాబోయే 25 ఏళ్ల కాలంలో దేశ విద్యుత్ రంగ ముఖ‌చిత్రం ఏ విధంగా ఉంటుందో తెలిపేలా వీడియోస్ ప్రదర్శించారు. గత కొన్ని రోజులుగా ఉజ్వల్ భారత్-ఉజ్వల్ భవిష్యత్ కార్యక్రమాలు జరుగుతున్నాయ. జూలై 30వ తేదీన ఇవి ముగియనున్నాయి. 2021-11 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 వరకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 3 లక్షల కోట్లకు పైగా డిస్కమ్ లకు ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంతో పెట్టుకుంది.