
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని ఫోర్స్ కోర్స్ ఏరియాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ కు విదేశాంగ శాఖ సెక్రటరీ విజయ్ గోఖలే స్వాగతం చెప్పారు. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ కూడా మోడీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
2014లో సార్క్ దేశాధినేతలను పిలిచిన ప్రధాని మోడీ.. ఈసారి బిమ్ స్టెక్ అధినేతలను ఆహ్వానించారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నాయకులు, ప్రతిపక్ష నేతలు పాల్గొంటారు.
ప్రధానమంత్రి మోడీతోపాటు.. కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.