మోడీ భీమవరం షెడ్యూల్

మోడీ భీమవరం షెడ్యూల్

హైదరాబాద్​ : తెలంగాణలో బీజేపీ కార్యవర్గసమావేశాలు ముగిశాక.. ప్రధాని నరేంద్ర మోడీ జూలై 4న ఏపీలో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఏఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ పార్కులో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఈనెల 4న ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యూల్‌‌‌‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌‌‌‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.29 గంటలకు బయలుదేరి 10.10కి విజయవాడకు మోడీ చేరుకుంటారు.

అక్కడి నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌‌‌‌లో బయలుదేరి 10.50 గంటలకు భీమవరానికి చేరుకుంటారు. 10.55కు హెలిప్యాడ్‌‌‌‌ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 12.30 హెలికాప్టర్‌‌‌‌లో బయలుదేరి 1.05 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.  మోడీ పర్యటనకు ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో భీమవరంలో ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించారు. హోటల్స్, వాణిజ్య సముదాయాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.