గుజరాత్‌‌లో మోడీ రెండు రోజుల పర్యటన

గుజరాత్‌‌లో మోడీ రెండు రోజుల పర్యటన

గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పటి నుంచే పార్టీలు రెడీ అయిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను నేతలు చుట్టేస్తున్నారు. ఇక్కడ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ వారాంతంలో రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేసిన ఖాదీ ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు భుజ్ ను సందర్శిస్తారు. ఉదయం 10  గంటలకు భుజ్ లోని స్మృతి వాన్ మెమోరియల్ ని సందర్శించి ప్రారంభించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం భుజ్ లోని క్రాంతి గురు శ్యామ్ జీ కృష్ణ వరమ కచ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. పలు ముఖ్యమైన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు . కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జపాన్ కంపెనీ సుజుకి 40 ఏళ్లను పురస్కరించుకుని గాంధీ నగర్ లో మహత్మ మందిర్ లో నిర్వహించే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. బీజేపీ కంచుకోటను బద్ధలు చేసేందుకు ఆప్ ప్లాన్స్ వేస్తోంది. రాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేపట్టింది. నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. డిప్యూటీ మనీష్ సిసోడియాతో కలిసి సభల్లో ప్రసంగిస్తున్నారు.