కార్గిల్ వీరుల త్యాగాలను దేశం గుర్తించుకుంటది: మోడీ

కార్గిల్ వీరుల త్యాగాలను దేశం గుర్తించుకుంటది: మోడీ

కార్గిల్ అమర వీరులకు నివాళి అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అమర వీరుల త్యాగాలను యావత్ భారతం స్మరించుకుంటుదని చెప్పారు. ఆనాటి యుద్ద సమయంలో తాను కార్గిల్ ప్రాంతంలో జవాన్లను కలిసిన ఫోటోలను మోడీ ట్వీట్ చేశారు. 1999లో తాను కశ్మీర్ ,హిమాచల్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నానని చెప్పిన మోడీ.. యుద్దం జరుగుతున్న సమయంలో కార్గిల్ వెళ్లి జవాన్లతో మాట్లాడిన ఘటన ఎప్పటికి మరిచిపోలేనిదన్నారు. కార్గిల్ ఆమరవీరులకు హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. భారత ఆర్మీ శక్తి పాటవాలకి, ధైర్యానికి కార్గిల్ యుద్ధం చిహ్నంగా నిలిచిందన్నారు.