
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఖాతాలో అగంతకులు బిట్ కాయిన్ ను ప్రమోట్ చేస్తూ పోస్టు చేశారు. బిట్ కాయిన్ ను భారత ప్రభుత్వం లీగల్ చేసిందని, ప్రభుత్వం 500 బిట్ కాయిన్ లు కొనుగోలు చేసి, ప్రజలకు పంచుతోందని లింక్ లు పోస్టు చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు స్పందించి.. ట్విట్టర్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్ ను తొలగించారు. ఆ తర్వాత ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు.