31న ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారం

31న ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారం
  • వర్చువల్​ర్యాలీకి బీజేపీ ఏర్పాట్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్​ ఎన్నికల రణ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల31న దాదాపు 21 అసెంబ్లీ స్థానాలను కవర్​ చేస్తూ చేపట్టే వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్నికల ర్యాలీలు, సభలపై ఈసీ ఆంక్షలు విధించిన క్రమంలో ఇప్పటికే సోషల్ ​మీడియాలో ప్రచార జోరు పెంచిన బీజేపీ.. సోమవారం జరిగే ప్రధాని వర్చువల్ ​ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని షామ్లీ, ముజఫర్‌‌నగర్, బాగ్‌‌పట్, సహరాన్‌‌పూర్, గౌతంబుద్ధ నగర్ ఐదు జిల్లాల్లో 21 అసెంబ్లీ స్థానాలు కవరయ్యేలా 100 చోట్ల ప్రధాని ప్రసంగం వినేందుకు పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, ప్రచార వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో లొకేషన్‌‌లో 500 మంది వ్యక్తులు పీఎం స్పీచ్​ వినేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వర్చువల్ ​ర్యాలీ ద్వారా దాదాపు 10 లక్షల మంది ఓటర్లను రీచ్​కావాలని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత బీజేపీ తరఫున ప్రధాని ప్రసంగించడం ఇదే మొదటిసారి కానుంది.