ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని లొంగదీసుకోలేదు: ప్రధాని మోడీ

ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని లొంగదీసుకోలేదు: ప్రధాని మోడీ

గుజరాత్, వెలుగు: సోమనాథ్ ఆలయ పున: నిర్మాణం వెయ్యేండ్ల ఆథ్యాత్మిక ప్రేరణకు మూలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ ను లొంగదీసుకోలేదని చెప్పారు. సోమనాథ్ ఆలయం పున: నిర్మాణం చేపట్టి 75 ఏండ్ల సోమవారినికి సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సాగర తీరంలో వెలసిన సోమనాథ్ మందిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రధానికి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. 

అనంతరం ఉత్సవ లింగానికి ప్రధాని అభిషేకాలు చేసి దీపారాధన సమర్పించారు.  ఈ మహోత్సవంలో భాగంగా గుడి గోపురంపై నీటితో నింపిన భారీ కల్షాన్ని  రిమోట్ తో మోదీ ప్రారంభించారు. అనంతరం నందిశ్వరుడు, త్రిశులంతో కూడిన భారీ జెండాను  గోపురంపై ఎగురవేశారు. మోదీ పూజలు ముగించిన సమయంలో ఒక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ పూలను ఆలయంపై చల్లింది. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ అక్రోబాటిక్స్ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించింది. ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాలన్నింటినీ భక్తిశ్రద్ధలతో వీక్షించారు. 

అంతకుముందు, ప్రధాని సోమనాథ్‌లో 'రోడ్ షో' నిర్వహించారు. మండుటెండలో ఆయన బహిరంగ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన ప్రజలకు అభివాదం ముందుకు సాగారు. ఆలయం ఎదురుగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.ఈ రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ లు పాల్గొన్నారు. ఈ మహోత్సవం సందర్భంగా... తపాలా శాఖ జారీ చేసిన ఒక తపాలా బిళ్ళను, రూ.75 విలువ గల ప్రత్యేక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు.

ఆలాంటి మనసత్వం ఉన్నవారితో అప్రమత్తంగా ఉండండీ..

అనంతరం ప్రభాస్ పటాన్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఒక దేశపు గుర్తింపుతో ముడిపడి ఉన్న ప్రదేశాలను విదేశీ దురాక్రమణదారులు నాశనం చేసిన లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా, ఆ దేశాల ప్రజలు తమ గుర్తింపును తిరిగి పొందడానికి, తమ జాతీయ గర్వాన్ని పునరుద్ధరించుకోవడానికి ఏకమయ్యాని గుర్తు చేశారు. కానీ భారత్ లో జాతీయ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలపై కూడా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు. ‘దేశ స్వాతంత్ర్యం తరువాత చేపట్టిన మొదటి పనులలో సోమనాథ దేవాలయం పునర్నిర్మాణం ఒకటి.  

సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఎంతో కృషి చేశారు. నెహ్రూ నుండి వారు ఎదుర్కొన్న వ్యతిరేకత తీవ్రత మనందరికీ తెలుసు. అంతటి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, వల్లభాయ్ పటేల్ తన నిర్ణయంపై దృఢంగా నిలబడ్డారు. దాని ఫలితంగా దేవాలయం పునర్నిర్మించబడింది. శతాబ్దాలుగా అలుముకున్న ఒక మచ్చను దేశం తుడిచివేసింది.’ అని అన్నారు. 

అయితే జాతీయ ఆత్మగౌరవం కంటే అశాంతికి ప్రాధాన్యతనిచ్చే శక్తులు మన దేశంలో ఇప్పటికీ పనిచేస్తున్నాయని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్తపించారు. రామ మందిర నిర్మాణం విషయంలో ఇలాంటి వారిని చూశామని, అటువంటి మనస్తత్వం పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంకుచిత రాజకీయాలను విడిచిపెట్టాలి. అభివృద్ధిని, వారసత్వాన్ని స్వీకరిస్తూ మనం ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మే 11 చాల ముఖ్యమైంది..

మే 11వ తేదీ దేశ చరిత్రలో  చాలా ముఖ్యమైందన్నారు. 1951 మే 11 సోమనాథ్ ఆలయ పున: నిర్మాణానికి అంకురార్పన జరిగిందన్నారు. అలాగే మే 11, 1988 లో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పోఖ్రాన్‌లో అణుబాంబు పరీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందన్నారు. దేశంపై అనేక ఆంక్షలు విధించబడ్డాయని... కానీ మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించిందన్నారు. 

దీంతో దేశ రాజకీయ సంకల్పం ఎంత అచంచలమైనదో ఇది ప్రపంచానికి నిరూపితమైందన్నారు. ఆ సమయంలో యావత్ ప్రపంచ ఒత్తిడి భారతదేశంపై ఉందని, అయినప్పటికీ, వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాకు దేశమే ప్రథమం అని స్పష్టం చేసిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని మోకరిల్లజేయలేదని, ఏ శక్తి కూడా ఒత్తిడికి లొంగేలా చేయలేదన్నారు. 

శివశక్తి స్వరూపం..

శివశక్తి ఆరాధన దేశ శాస్త్రీయ ప్రగతికి కూడా స్ఫూర్తిగా నిలవాలని ప్రధాని కాంక్షించారు. ప్రొఖ్రాన్ లో అను పరీక్ష కు ‘ఆపరేషన్ శక్తి’ శక్తిగా నామకరణం చేశారన్నారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా సోమనాథ స్వామి పాదాల చెంత నుండి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ప్రసంగంచారు. ‘దేశం పోఖ్రాన్ అణు పరీక్షకు 'ఆపరేషన్ శక్తి' అని పేరు పెట్టింది. ఎందుకంటే శివునితో పాటు శక్తిని పూజించడం మన సంప్రదాయం.

అర్ధనారీశ్వరుడైన శివుడు కూడా శక్తితోనే పరిపూర్ణుడు. దేశం చేపట్టిన చంద్రయాన్ మిషన్ విజయవంతమైనప్పుడు, చంద్రునిపై భారతదేశపు రోవర్ దిగిన ప్రదేశానికి 'శివ శక్తి పాయింట్' అని పేరు పెట్టాం. ఎందుకంటే మన విశ్వాసంలో చంద్రుడు శివునితో... శివుడు శక్తితో ముడిపడి ఉంటారు. అంతేకాదు, ఈ జ్యోతిర్లింగానికి చంద్రుని పేరు మీదుగా సోమనాథ్ అని పేరు పెట్టడం ఎంత అద్భుతం’ అని అన్నారు