
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ జాతినుద్దేశించి ఢిల్లీనుంచి మాట్లాడబోతున్నారు. జమ్ముకశ్మీర్ పునర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందింది. జమ్ముకశ్మీర్ కు భారత రాజ్యాంగం వర్తిస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఇప్పటికే వచ్చాయి. మరోవారంరోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం కూడా ఉండటంతో ఈ మొత్తం అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీ ద్వారా ప్రసంగించనున్నారు.
కశ్మీర్ స్వాతంత్ర్యం పూర్వ పరిస్థితులు.. స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లుగా ఏం జరిగింది.. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. అనే అంశాలను ప్రధాని మోడీ వివరించే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో లేవనెత్తిన అభ్యంతరాలపైనా ప్రధాని వివరణ ఇచ్చే సూచనలున్నాయి. టీవీల ద్వారా ప్రధాని ఏం చెబుతారన్నదానిపై దేశమంతటా ఆసక్తి ఏర్పడింది.