రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం

రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. రోశయ్య సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని మోదీ తెలిపారు. కాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. బీపీ పడిపోవడంతో హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు.