డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ

డొనాల్డ్  ట్రంప్ పై కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై ప్రధాని నరేంద్ర మోదీ  స్పందించారు. తన  స్నేహితుడిపై దాడి పట్ల  ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.  రాజకీయాల్లో హింసకు స్థానం లేదన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరారు. గాయాలైన వారు త్వరగా  కోలుకోవాలని తెలిపారు. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోాదీ. 

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్లోని భవనంలో నుంచి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్రగాయాలయ్యాయి. ప్రచారంలో పాల్గొన్న ఒక  వ్యక్తి చనిపోగా..మరో  ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు.   ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. దాదాపు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.