రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్

రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్

అగ్రి ఇన్‌‌ఫ్రా ఫండ్‌‌ను లాంఛ్‌చేసిన ప్రధాని
అగ్రి స్టార్టప్‌లు, ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లు, రైతు సంఘాలకు రాయితీలతో అప్పులు

న్యూఢిల్లీ: దేశ వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అగ్రికల్చర్‌ సెక్టార్‌‌లో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను బలోపేతం చేయడానికి రూ.లక్ష కోట్లతో అగ్రిఇన్‌‌ఫ్రా ఫండ్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం లాంచ్ చేశారు. పండిన పంటలను నిల్వచేసేందుకు, అమ్ముకునేందుకు రైతులకు సరియైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదని, ఈ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను డెవలప్‌ చేసేందుకు ఈ రూ. లక్ష కోట్ల ఫండ్‌ ‌ఉపయోగపడుతుందని మోడీ చెప్పారు . గ్రామాలలో అగ్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను డెవలప్‌ చేయడంతో పాటు, జాబ్స్ క్రియేట్‌ ‌చేయడమే ఈ ఫండ్‌ ‌ముఖ్య ఉద్దేశమని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రొడక్షన్‌‌లో ఇండియాకు ఎలాంటి సమస్యలు లేవని, పండిన పంటలను నిలుపుకోవడంలో, అమ్ము కోవడంలో నష్టాలొస్తున్నాయని మోడీ అన్నారు. ఈ నష్టాలను తగ్గించడానికి అగ్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీస్‌‌ను బలోపేతం చేస్తున్నామని, దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

న్యాయపరమైన అడ్డంకులుతొలగిస్తున్నాం..
అగ్రీ సెక్టార్‌‌లో న్యాయపరమైన ఇబ్బందులను తగ్గిస్తున్నామని, వ్యవసాయ సంస్కరణలకు ఇది చాలా కీలమైనదని మోడీ పేర్కొన్నారు. దీంతో గ్రామీణ భారతంలో పెట్టుబుడులు వస్తాయని అన్నారు. రూ. లక్ష కోట్లతో అగ్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ ప్రారంభించారు. రైతులు పవిత్రంగా భావించే ‘బలరాం జయంతి’ కూడా ఆదివారం కావడం విశేషం. ఈ వీడియో కాన్పరెన్స్‌ ‌లో అగ్రికల్చర్‌ మినిస్టర్‌ నరేంద్ర సింగ్‌ తోమర్‌‌, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. గ్రామాలలో పంటల స్టోరేజి ఫెసిలిటీస్‌‌, కోల్డ్‌ స్టోరేజి చెయిన్స్‌ ‌ను ఏర్పాటు చేయడంలో ఈ ఫండ్‌‌ ద్వారా అర్హులైనవారికి అప్పులిస్తారు. కోతలు పూర్తయ్యాక పంటలను మేనేజ్‌‌ చేయడానికి వేర్‌ హౌసింగ్‌‌, కోల్డ్‌ చెయిన్‌‌, ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌ వంటివి చాలా అవసరమని, ఈ విభాగాలలో ఇన్వెస్ట్‌ చేయడానికి అనేక అవకాశాలున్నాయని మోడీ అన్నారు. ఈ ఫండ్ ద్వారా వ్యవసాయ రంగంలో ఉన్న స్టార్టప్‌‌లకు మంచి అవకాశాలు క్రియేట్‌‌ అవుతాయని మోడీ పేర్కొన్నారు. తమ ఆపరేషన్స్‌‌ను పెంచుకోవడానికి, దేశంలో ప్రతి రైతుకు చేరువయ్యేలా ఎకోసిస్టమ్‌‌ను డెవలప్‌ చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. కర్నాటక, గుజరాత్‌‌, మధ్యప్రదేశ్‌‌లకు చెందిన కొంత మంది రైతులతో మోడీ ఇంటారాక్ట్‌ అయ్యారు.

పాత చట్టాలతోనే పెట్టుబడులు రావడం లే..
అగ్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌లో ఇన్వెస్ట్‌ ‌మెంట్స్‌ తక్కువగా ఉండడానికి న్యాయపరమైన అడ్డంకులే కారణమని మోడీ పేర్కొన్నారు. ఎసెన్షియల్ కమోడిటీస్ ‌చట్టంలో స్టాక్ లిమిట్‌ ‌రూల్‌‌ దీనికి అడ్డంకిగా ఉందన్నారు .ప్రస్తుతం ఇండియాలో ఫుడ్‌ ‌ప్రొడక్షన్‌‌ మిగులు స్థాయికి చేరుకుందని, అయినప్పటికీ స్టాక్‌ లిమిట్‌ రూల్‌‌ ద్వారా రైతులు, ఎకానమీ ఇబ్బంది పడుతోందని చెప్పారు. ఫుడ్‌‌ ప్రొడక్షన్‌‌లో ఇండియా మిగులు దేశంగా మారినప్పటికీ ఈ ఈసీ చట్టం ఇంకా కొనసాగుతోందని, ఈ చట్టం ఇప్పుడిక అవసరం లేదని పేర్కొన్నారు. గోడౌన్లు ఏర్పాటు చేయడంలో ఈ చట్టం ఒక అడ్డంకిగా ఉందని అభిప్రాయపడ్డారు. రైతులు తమ ఉత్పత్తులను మండీలకు వెలుపల అమ్ముకునేందుకు ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌ ‌ను తీసుకొచ్చిందని, ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం తమ ఉత్పత్తులను డైరెక్ట్ గా కంపెనీలకు అమ్ముకునేందుకు కూడా వీలుంటుందని మోడీ అన్నారు.

ఫైనాన్షియల్‌‌‌‌ సంస్థలు కలిసి రూ. లక్ష కోట్లు..
కోతలు తర్వాత పంటలకు అవసరమయ్యే పెసిలిటీస్‌‌ను ఏర్పాటు చేసేందుకు ఈ రైతులకు ఈ ఫండ్‌‌ కింద ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్‌‌ సొషైటీస్‌‌(పీఏసీఎస్‌‌) ద్వారా అప్పులిచ్చారు. కాగా, కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు భాగస్వామ్యమై రూ. లక్ష కోట్లను అగ్రి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌‌ కింద పీఏసీఎస్‌‌, రైతు సంఘాలు, ఫార్మర్‌ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ ‌(ఎఫ్‌‌పీఓ), అగ్రి ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌, స్టార్టప్‌‌, అగ్రి టెక్‌ కంపెనీలకు అప్పులిస్తాయి. దీని కోసం ఇప్పటికే 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు అగ్రికల్చర్‌ మినిస్ట్రీతో కలిసి ఇనిషియల్‌ ‌అగ్రిమెంట్స్‌‌పై సంతకాలు చేశాయి. ఈ ఫండ్‌‌ ద్వారా రూ. 2 కోట్ల వరకు లోన్‌ ‌తీసుకున్నవారికి వడ్డీలో 3 శాతం రాయితీ, క్రెడిట్‌‌ గ్యారెంటీ ఉంటుంది. లోన్స్‌‌ను వచ్చే నాలుగేళ్లలో పంపిణీ చేస్తారు. ఈ ఫండ్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10 వేల కోట్లను, రానున్న మూడు ఆర్థిక సంవత్సరాలలో రూ. 30 వేల కోట్ల చొప్పున యాడ్‌ ‌చేస్తారు.

పీఎం కిసాన్‌‌ డబ్బులు పడ్డాయ్‌..
పీఎం కిసాన్‌‌ స్కీమ్‌‌లో భాగంగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లలోకి రూ. 17,000 కోట్లను ప్రధాని మోడీ ఆదివారం ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేశారు. మొత్తం 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులను వేశారు. మిడిల్‌‌ మ్యాన్‌‌ ప్రమేయం లేకుండా రైతులకు ఈ స్కీమ్‌‌ ద్వారా ఆర్థిక సహకారం అందుతోందన్నారు. కాగా,ఈ స్కీమ్‌‌ కింద ప్రతి ఏడాది రైతు ఖాతాలోకి రూ. 6,000 లను మూడు ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలో ప్రభుత్వం వేస్తోంది. గతేడాదిన్నర కాలంలో రూ. 75 వేల కోట్లను ఈ స్కీమ్‌‌ ద్వారా రైతు ఖాతాలలోకి వేశామని మోడీ చెప్పారు.

For More News…

ఐపీఎల్‌కు స్పాన్సర్‌ దొరికేనా?

ట్విట్టర్ చేతికి టిక్‌టాక్‌?

టిక్‌టాక్ ప్లేస్ లో వచ్చిన చింగారికి రూ.9 కోట్ల మనీ