కేఎంసీకి అనిశెట్టి రజిత డెడ్ బాడి

కేఎంసీకి అనిశెట్టి రజిత డెడ్ బాడి

వరంగల్‍, వెలుగు: ప్రముఖ కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత(67) డెడ్​బాడీని వరంగల్‍  కాకతీయ మెడికల్‍  కాలేజీకి దానం చేశారు. సోమవారం గుండెపోటుతో ఆమె చనిపోగా, ఆమె మృతదేహాన్ని చివరి చూపు కోసం ప్రొఫెసర్‍  కాత్యాయని విద్మహే నివాసం వద్ద ఉంచారు. మంగళవారం ఉదయం ర్యాలీగా వరంగల్​ కేఎంసీకి తరలించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, రచయితలు, సాహితివేత్తలు, పౌరహక్కుల సంఘం నేతలు, కేయూ స్టూడెంట్లు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె డెడ్​బాడీని కేఎంసీకి అందజేశారు.