ముంబై ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డ కంగ‌నా

ముంబై ప్రభుత్వంపై  విరుచుకుప‌డ్డ కంగ‌నా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై, బాలీవుడ్ ఇండస్ట్రీ పై మండిప‌డ్డారు. బృహ‌న్ముంబై న‌గ‌ర పాల‌క సంస్థ (బీఎంసీ) అధికారులు అక్ర‌మంగా నిర్మాణాలు చేప‌ట్టారంటూ బాంద్రాలో కంగనా ఆఫీస్ ను కూల్చేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే కూల్చివేత‌ను నిలిపివేయాలంటూ బొంబాయి హైకోర్ట్ ఆదేశించింది. దీంతో కంగ‌నా ఆఫీస్ కుల్చివేతను నిలిపివేశారు.

ఈ నేప‌థ్యంలో టూర్ నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కంగ‌నా కు వ్య‌తిరేకంగా శివ‌సేన అభిమానులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌ల అనంత‌రం ఆమె మ‌హారాష్ట్ర‌ప్ర‌భుత్వం, బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై విరుచుకుప‌డ్డారు.

రాష్ట్రంలో అధికార‌పార్టీ శివసేన నేతృత్వంలో నడుస్తున్న బృహన్ముంబై నగర పాలక సంస్థ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తనపై అక్కసుతో తన బాంద్రాలోని ఆఫీస్ ని కూల్చార‌ని ఆరోపించారు. తాను ఎటువంటి అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌కు పాల్ప‌డలేద‌ని అన్నారు. శివసేనతో పోరాడుతున్నందువల్లే రాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు.

నేను ఎప్పుడూ తప్పు కాదు అందుకే నా ముంబై ఇప్పుడు POK #deathofdemocracy” అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.

త‌న ఇంటిని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌బీఎంసీ బృందం ఫోటోలను యాడ్ చేస్తూ “పాకిస్తాన్ …” మరియు “బాబర్ మరియు అతని సైన్యం” అని క్యాప్షన్ యాడ్ చేసింది.

నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది అంటూ ట్విట్టర్ ద్వారా కంగనా మండిపడ్డారు.