జగిత్యాలలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది . ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. జగిత్యాల పోలీసులు. విద్యార్థులను కన్నతండ్రిలా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ వక్రబుద్ది ప్రవర్తించాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. యూట్యూబ్ లో అసాంఘిక వీడియోలు చూపిస్తూ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి .. జగిత్యాల మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా .. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.