పోలవరం పవర్ స్టేషన్ పనుల పరిశీలన

పోలవరం పవర్ స్టేషన్ పనుల పరిశీలన

పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులను జెన్ కో ఎండీ చక్రధర్ బాబు పరిశీలించారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని అక్కడి అధికారులకు సూచించారు.  

ముందుగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను ఎండీ చక్రధర్ బాబు పరిశీలించారు. ఆ తరువాత జలవిద్యుత్ కేంద్రం ఫెరోల్స్ తయారీ, ఇతర నిర్మాణాలను గురించి ఆయన ఆరా తీశారు. జెన్ కో కోసం నిర్మిస్తున్న కార్యాలయం దగ్గర చక్రధర్ బాబు మొక్కలు నాటారు. ఇప్పటి వరకు ప్రణాళిక ప్రకారమే పనులు జరిగాయని.. ఇక ముందు కూడా అలానే పనులు చేయాలన్నారు.

Also Read :- ప్లాన్ ప్రకారమే నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం: కిషన్ రెడ్డి

ప్రాజెక్ట్ నిర్మాణానికి జెన్ కో, ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాకరిస్తున్నాయని చక్రధర్ బాబు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్ కో హైడెల్ డైరెక్టర్ ఎంవీవీ సత్యనారాయణ, హైడల్ ప్రాజెక్ట్ సిఈ ఎం సూరజ్ కుమార్, కోటేశ్వర రావు, ఎం రవీంద్ర రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు .