రేపు కమలాపురంలో కేటీఆర్ టూర్..బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్ 

రేపు కమలాపురంలో కేటీఆర్ టూర్..బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్ 

హనుమకొండ : రేపు (ఈనెల31న) కమలాపురంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి నుండి ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు కమలాపురంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇప్పటికే వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ముందస్తు అరెస్తులపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

రేపు ఉదయం మంత్రి కేటీఆర్ కరీంనగర్ నుంచి కమలాపూర్ కు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. సుమారు 49 కోట్లతో చేపట్టనున్న ఎంజేపీ గురుకుల విద్యాలయం, కస్తూర్బా గాంధీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కుల సంఘం భవనాలు, బస్టాండ్ నిర్మాణం, అయ్యప్ప ఆలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.