కిరాణా షాపులో గంజాయి .. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కిరాణా షాపులో గంజాయి .. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చెన్నూరు, వెలుగు: కిరాణా షాపులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం రాజు తన దుకాణంలో గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతని షాపులో తనిఖీలు చేయగా.. 500 గ్రాముల గంజాయి, స్మోకింగ్  రోలింగ్, పేపర్  కోన్స్  లభించాయి.

రాజుతో పాటు అతడి స్నేహితులు ఇర్ఫాన్,  బిలాల్ ను అదుపులో తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నామని తెలిపారు. ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు.