
మంచిర్యాల/ బెల్లంపల్లి , వెలుగు: మంచిర్యాల జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. మందమర్రి, జైపూర్, నస్పూర్ లో తెల్లవారు జమున నుంచి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆయా చోట్ల టీడీపీ, బీఎస్సీ, సీఐటీయూ లీడర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అక్రమ అరెస్టులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
సీఐటీయూ లీడర్ల అక్రమ అరెస్టులపై శ్రీరాంపూర్ ఏరియాలోని కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన మెమోరండం ఇవ్వనియకుండా అరెస్టులు చేయడంపై మండిపడ్డారు. మంచిర్యాలలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హారి కృష్ణ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనతోపాటు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు .రెడ్డిమల్ల అశోక్ ఉన్నారు.