టాలీవుడ్ నటుడు నాగశౌర్య తండ్రి అరెస్ట్

టాలీవుడ్ నటుడు నాగశౌర్య తండ్రి అరెస్ట్

సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లో ఫాంహౌస్‌లో పేకాట కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని ఉప్పర్ పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. గుత్తా సుమన్ అనే వ్యక్తితో కలిసి శివలింగ ప్రసాద్ పేకాటదందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు.

మరోవైపు శివలింగప్రసాద్‌ కు కోర్టు రిమాండ్ విధించింది. అయితే.. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో..కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.