సర్కార్ స్కూల్‌ గేటుకు 'ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ బ్యానర్

సర్కార్ స్కూల్‌ గేటుకు 'ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ బ్యానర్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యవహారంపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల గేట్‍కు సిసోడియా బ్యానర్ ఏర్పాటైంది. దీనిపై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఆస్తుల దుర్వినియోగ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద శాస్త్రిపార్క్ పోలీస్ స్టేషన్‍లో ఈ కేసు నమోదైంది. స్కూల్ మేనేజ్‍మెంట్ కమిటీ (SMC) కో-ఆర్టినేటర్ గజాలాతో పాటు ప్రిన్సిపాల్.. స్కూల్ గేట్‍కు సిసోడియా బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకరించారని తెలుస్తోంది.

అయితే ఈ పోస్టర్ ను మ్ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొందరు శాస్త్రిగేట్ ప్రభుత్వ పాఠశాల గేట్‍కు తగిలించారని ఫిర్యాదు చేసిన దివాకర్ పాండే ఆరోపించారు. అయితే ఈ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే అనుమతి ఉందని కూడా ఆప్ కార్యకర్తలు చెప్పినట్టు ఆయన తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం పాఠశాలను వినియోగించుకునేందుకు ఇలాంటి అనుమతులు ఏవీ ఉండవని తమకు తెలుసునని దివాకర్ పాండే వెల్లడించారు.