గోదావరిఖని, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, గవర్నమెంట్హాస్పిటల్, ఓల్డ్ అశోక్ సెంటర్ వంటి జన సమ్మర్థ ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్లతో సోదాలు చేశారు.
ఏసీపీ రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు.
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో..
హుజూరాబాద్/జమ్మికుంట, వెలుగు: ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణ పరిధిలో ఏసీపీ మాధవి నేతృత్వంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, కొరియర్ సెంటర్స్, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ సీఐ పుల్లయ్య, జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, హుజూరాబాద్‌లో ఎస్‌ఐ యూనస్ అహ్మద్ అలీ పాల్గొన్నారు.
