జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్డెన్ సెర్చ్‌‌‌‌‌‌‌‌

జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్డెన్ సెర్చ్‌‌‌‌‌‌‌‌

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు గురువారం కార్డెన్‌‌‌‌‌‌‌‌ సెర్చ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. హుజూరాబాద్​ ఏసీనీ మాధవి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వాడవాడలా తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 15 ట్రాక్టర్లను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పీఎస్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పనిసరిగా అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జమ్మికుంట టౌన్​ ఎస్సై రామకృష్ణగౌడ్, రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఇల్లందకుంట ఎస్సై రాజ్​కుమార్, వీణవంక ఎస్సై తిరుపతి, హుజూరాబాద్ ఎస్సైరాధాకృష్ణ పాల్గొన్నారు.