ఏఓబిలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఏఓబిలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

అల్లూరి సీతారామారాజు జిల్లా/ కొరాపుట్ జిల్లా: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కోరాఫుట్ జిల్లా ఎస్పీ వరుణ్ గుంటుపల్లి డంప్ స్వాధీనాన్ని ధృవీకరించారు. మీడియా సమావేశంలో డంప్ వివరాలు వెల్లడించారు. 
ఆంధ్రా  ఒడిశా రెండు రాష్ట్రాల పోలీసులు సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంగబయలు పంచాయతీ, కొరాపుట్ జిల్లా ఆండ్రహాల్ పంచాయతీ సరిహద్దులోని సింధి పుట్ గ్రామంలో మావోయిస్టుల డంప్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో 7 లక్షల రూపాయల నగదు, 31 జిలెటిన్ స్టిక్స్, 11 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 టిఫిన్ బాక్స్ బాంబులు, 1 ప్రెషర్ కుక్కర్ బాంబు, పేలుడు పదార్థాలకు ఉపయోగించే తీగలు ఉన్నాయి.