మస్తు తాగి.. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన్రు

మస్తు తాగి.. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన్రు

హైదరాబాద్: న్యూ ఇయర్ కు ప్రజలు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. పబ్బులు, బార్లలో ధూమ్ ధామ్ గా ఎంజాయ్  చేశారు. పల్లెల నుంచి సిటీల వరకు అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి లిక్కర్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది. మద్యం ద్వారా సర్కార్ కు మస్తు ఆమ్దానీ వచ్చింది. డిసెంబర్ 28 నుంచి శుక్రవారం రాత్రి వరకు రూ.710 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, లిక్కర్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చాలా మంది పట్టుబడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 

ఎల్బీ నగర్ జోన్ లో 57, ఉప్పల్ లో 77, మల్కాజ్ గిరిలో 52, వనస్థలిపురంలో 62, భువనగిరిలో 10, యాదాద్రిలో 11 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో టూ వీలర్ వాహనాలు 299, త్రీ వీలర్ 6, ఫోర్ వీలర్ 52, మూడు లారీలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 32 బైక్ లు , 5 ఆటోలు, 15 కార్లు, 3 డీసీఎమ్ వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు షాక్!

దొంగ అని పొరబడి.. కూతురిని కాల్చేసిండు

గోవింద నామస్మరణతో కొత్తేడాది వేడుకలు