లిప్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ పోలీసులు

లిప్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ పోలీసులు

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ పై జరిగిన ఘోరం మరవకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆడది భయటకి వస్తే చాలు, సందుల్లోను, గొందుల్లోను, రోడ్లల్లోనూ, బస్సుల్లోనూ, బస్టాపుల్లోను ఎక్కడపడితే అక్కడ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ల మధ్య నడవాల్సి వస్తుంది. నిర్భయలాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్లల్లో మార్పు రావడంలేదు.

ఒడిస్సా లో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు  భువనేశ్వర్ నుంచి తన స్వగ్రామం కాకత్ పూర్ కు వెళ్లేందుకు బస్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో ఓ పోలీస్ అధికారి డ్రాప్ చేస్తానంటూ బస్టాప్ లో నిలుచున్న మహిళని కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత  మరో ముగ్గురు వ్యక్తులు కారెక్కారు. కారులో ఉన్న బాధితురాల్ని కాకత్ పూర్ వైపు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ దుర్మార్గులు పూరీ పట్టణంలో పోలీస్ అధికారి నివాసం ఉంటే జాడేశ్వర్ ప్రాంతంలోని ఆ మహిళలను బలవంతంగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

మృగాళ్ల పైశాచికత్వంతో ఆపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలు కొన్ని గంటల తరువాత స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని బాధితురాలు పోలీసులకు కంప్లెయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణలో భాగంగా బాధితురాపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పోలీస్ అధికారి వ్యాలెట్, ఐడెంటిటీ కార్డులు లభ్యమయ్యాయి. ఐడీ కార్డుల ఆధారంగా నిందితులు పోలీసులేనని నిర్ధారణకు వచ్చినట్లు, పరారీలో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేస్తామని  పూరీ ఎస్పీ ఉమశంకర్ దాస్ వెల్లడించారు.