
కామారెడ్డి: దొంగ నోట్లు చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మంది అంతర్రాష్ట్ర సభ్యుల ముఠాలో ఎనిమిది మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కస్టమర్లను ఏర్పాటు చేసుకొని వారికి కొరియర్ ద్వారా నకిలీ నోట్లను ఈ ముఠా సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండు 500 రూపాయల నకిలీ నోట్లతో హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ మహారాష్ట్రలకు చెందిన పెద్ద ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో పాటు, పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది ముఠా సభ్యులను పట్టుకోనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 25 లక్షల వరకు దొంగ నోట్లు చలామణిలోకి వెళ్ళాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఠా సభ్యుల వద్ద నుంచి మూడు లక్షల ఎనిమిది వేల రెండు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
►ALSO READ | సూర్యాపేట జిల్లాలో విషాదం.. ప్రాణం తీసుకున్న ఏఎస్సై.. గేటెడ్ కమ్యూనిటీలోని ఇంట్లో..
నకిలీ నోట్ల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!
— SP Kamareddy (@sp_kamareddy) October 11, 2025
• కామారెడ్డి పోలీసులు భారీ ఆపరేషన్
• 12మందిలో 8మంది అరెస్ట్
• ₹3.08లక్షల ఫేక్ నోట్లు స్వాధీనం
• ల్యాప్టాప్లు,ప్రింటర్లు,కార్,మొబైళ్లు జప్తు
• WB,బీహార్,UP,ఛత్తీస్గఢ్ లింకులు
SP శ్రీ రాజేష్ చంద్ర, IPS గారు బృందాలను అభినందించారు. pic.twitter.com/gWYEtTrjfT