
ప్రియాంక హత్యకేసులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని బాధితురాల్ని తండ్రి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదుగంటలకు టోల్ ప్లాజ్ వద్దకు వచ్చింది. టోల్ ప్లాజానుంచి 9.30 ఇంటికి ఫోన్ చేసింది. ఆ తరువాత పోన్ డిస్ కనెక్ట్ కావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రియాంకరెడ్డి హత్యపై ఆమె తండ్రి పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయంలో కంప్లెయింట్ ఇచ్చినా ఎందుకు స్పందించలేదని అన్నారు.
కొంతమంది పోలీసులు తమతో పంపించి ఉంటే ఆ రాత్రి తమ కూతురు బతికి బయటపడేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ కింద ప్రియాంక డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారానికి ముందు పోలీసులు అలర్ట్ కాలేదని బాధితురాలి తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే పోలీసులు రెస్పాండ్ అయితే ప్రియాంక సేఫ్ అయ్యేదని వాదిస్తున్నారు.
కేసును ఛేదించే క్రమంలో పొలీసులు ఎంత స్పీడ్ గా ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి, సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారో… ప్రియాంక కనిపించలేదని తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ దారుణం నుంచి బయట పడేదని ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.